Header Banner

ఏపీలో రెండు చోట్ల వైరస్‌ నిర్ధారణ! రెడ్ జోన్ ఏర్పాటు - పీపీఈ కిట్లతో కోళ్ల తనిఖీలు.!

  Tue Feb 11, 2025 13:28        India

ఏపీలోని తూర్పు, పశ్చిమగోదావరి(Godavari) జిల్లాలో గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అంతుచిక్కని వైరస్ తో కోళ్లు వేల సంఖ్యలో చనిపోతున్నట్లు ఇన్నాళ్లూ భావించారు. కానీ ఇవాళ తొలి బర్డ్ ఫ్లూ(Bird flu) కేసు బయటపడింది. పశ్చిమగోదావరి జిల్లాలోని పెరవలి మండలం కానూరులో తొలి బర్డ్ ఫ్లూ(Bird flu) కేసు నిర్ధారణ అయినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లాలో మాంసం అమ్మకాలపై ఆంక్షలు విధిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలంలోని కానూరులో బర్డ్ ఫ్లూ(Bird flu) కేసు బయటపడిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించారు. అక్కడ పీపీఈ కిట్లతో సిబ్బంది కోళ్లకు వైరస్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. చనిపోయిన కోళ్లను దూరంగా తీసుకెళ్లి కాల్చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: BSNL యూజర్లకు గుడ్ న్యూస్.. మ‌రో స‌రికొత్త డేటా ప్లాన్‌! ప్ర‌తిరోజు 2జీబీ డేటా ఫ్రీ.!

 

తద్వారా మిగతా కోళ్లకు ఈ వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు హేచరీల్లో భారీ సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో కోళ్ల అమ్మకాలు సైతం నిలిచిపోయాయి. ఇప్పుడు అధికారులు మాసం దుకాణాల్ని సైతం మూసేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ సంఖ్యలో కోళ్ల మృత్యువాత , బర్డ్ ఫ్లూ (Bird flu) కేసు బయటపడిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నాగరాణి ఇవాళ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో బర్డ్ ఫ్లూ(Bird flu) వైరస్ వ్యాప్తికి సంబంధించి తాజా పరిస్ధితిని అంచనా వేయనున్నారు. ఆ తర్వాత మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన చెప్తున్నారు. ఇప్పటికే కోళ్ల నుంచి సేకరించిన శాంపిల్స్ ను ల్యాబ్స్ కు పంపారు. రెండు రోజుల్లో వీటి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆ లోపు కోళ్ల ఫారాలను మూసేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో కోళ్ల రైతులు గగ్గోలు పెడుతున్నారు. అలాగే చికెన్ వినియోగదారులు సైతం ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి: ప్రజలకు కీలక అప్డేట్.. ఏపీలో మీకు భూమి ఉందా.! వెంటనే ఇలా చెయ్యండి, లేదంటే.. రద్దవ్వగలదు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఎంతకైనా తెగిస్తారు.. మంత్రులు జాగ్రత్తగా ఉండాలని చెప్పిన చంద్రబాబు!

 

ఉదయభాను కూతుళ్లకు మర్చిపోలేని గిఫ్ట్ పంపించిన నారా బ్రాహ్మణి.. అది ఏంటంటే?

 

అమెరికాలో మరో భారీ విమాన ప్రమాదం.. తాత్కాలికంగా ఎయిర్ పోర్ట్ ను మూసేసిన అధికారులు!

 

టాలీవుడ్ లో హల్ చల్.. ప్లీజ్ ఇక వదిలేయండి.. రామ్ చరణ్ ను నేను ఉద్దేశపూర్వకంగా ఏమీ అనలేదు!

 

జగన్ కి షాక్.. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు!

 

షాకింగ్ న్యూస్.. ట్రంప్ బాటలో UK ప్రధాని.. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం! 600 మందికి పైగా.. భారతీయ విద్యార్థులకు నిరాశ తప్పదా?

 

అసలు వీడు మనిషేనా.. రేషన్ కార్డు కావాలంటే నీ కూతుర్ని నా దగ్గరకు పంపు.. ఆ జిల్లాలో కామ కీచకుడు!

 

విద్యార్థులకు తీపి కబురు అందించిన సీఎం! వారందరికీ ఉపకార వేతనాలు! ఒక్కొక్కరికి ఎంత అంటే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #BirdFluCases #RedZone #Godavari